Skip to content
Ahmed Ali KhanYSRCP Kurnool City President
Social Service

Community Development

7 activities

ఆవాజ్ టీవీ ఉర్దూ ఛానల్ చైర్మన్ శ్రీ ఎస్. మహబూబ్ బాషా గారు నిర్వహించిన గెట్-టుగ…

ఆవాజ్ టీవీ ఉర్దూ ఛానల్ చైర్మన్ శ్రీ ఎస్. మహబూబ్ బాషా గారు నిర్వహించిన గెట్-టుగెదర్ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు శ్రీ అహ్మద్ అలీ ఖాన్ గారు పాల్గొని, చైర్మన్ గారికి మరియు ఆవాజ్ టీవీ బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ టీవీ ఉర్దూ ఛానల్ మరింత అభివృద్ధి చెందుతూ, ఉర్దూ భాషా వికాసానికి మరియు సమాజ సేవకు విశిష్టమైన వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

దావీద్ అన్న సీనియర్ నాయకుడు, ప్రసాద్ గారు ఎంఆర్‌పీఎస్ నాయకుడు మరియు నాగన్న వార…

దావీద్ అన్న సీనియర్ నాయకుడు, ప్రసాద్ గారు ఎంఆర్‌పీఎస్ నాయకుడు మరియు నాగన్న వారి మిత్రబృందం ఆహ్వానం మేరకు ఈ రోజు బుధవారపేటలోని వారి నివాసానికి కర్నూలు నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కార్యకర్తలు మరియు మిత్రబృంద సభ్యులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం మరియు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అహ్మద్ అలీ ఖాన్ గారు పేర్కొన్నారు. అలాగే వైఎస్సార్సీపీ సిద్ధాంతాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో దావీద్ అన్న, ప్రసాద్ గారు, నాగన్న మరియు వారి మిత్రబృంద సభ్యులు అహ్మద్ అలీ ఖాన్ గారిపై తమ అభిమానాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు ఘన సన్మానం చేశారు. ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ సమావేశం విజయవంతంగా ముగిసింది

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

కర్నూలు 8వ వార్డ్ వైఎస్సార్సీపీ నాయకులు షాకీర్ భాయ్, ఫరూక్ భాయ్, జానీ, అబ్దుల్…

కర్నూలు 8వ వార్డ్ వైఎస్సార్సీపీ నాయకులు షాకీర్ భాయ్, ఫరూక్ భాయ్, జానీ, అబ్దుల్లా & షాషా గారు వార్డ్ సభ్యులతో కలిసి గార్గేయపురం సమీపంలోని నూతనంగా నిర్మించిన మస్జిద్-ఏ-సయ్యద్ బాషా వద్ద నిర్వహించనున్న ప్రార్థనలకు ఆహ్వానించేందుకు విచ్చేశారు.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

కర్నూల్ లో తజ్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “మన సమాజం – మన బాధ్యత” అనే అంశంపై జ…

కర్నూల్ లో తజ్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “మన సమాజం – మన బాధ్యత” అనే అంశంపై జరిగిన ఘనమైన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యాను. ఈ కార్యక్రమం అడ్వకేట్ ఖాజీ అబ్దుల్ ఖదీర్ శుఐబీ పర్యవేక్షణలో, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహ్మాని సాహెబ్ గార్ల ఆధ్వర్యంలో జరిగింది. జామియత్ ఉలేమా హింద్ నుండి ముఫ్తీ మహ్మూద్ జుబైర్ గారు మరియు అనేక జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

ఈ రోజు ఖిద్మత్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వార్షిక మహాసభకు…

ఈ రోజు ఖిద్మత్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వార్షిక మహాసభకు ప్రత్యేక ముఖ్య అతిథిగా ఆహ్వానించబడాను. పేద వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ, ఈ సంఘం కర్నూలులో గత నాలుగేళ్లుగా పనిచేస్తోంది. చిన్న, సూక్ష్మ వ్యాపారాలకు వేలమందికి సహాయం చేసింది. వారి అభివృద్ధి, విజయాలు నిరంతరం కొనసాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను…

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

Honoured To Be As Chief Guest For Sahity Otsav Program Conducted By SSF Organi…

Honoured To Be As Chief Guest For Sahity Otsav Program Conducted By SSF Organisation Andhra Pradesh at Taher e Gulshan, Kurnool

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

కర్నూలు జిల్లా కేంద్రంలో వైయస్ఆర్ సీపీ క్యాండిల్ ర్యాలీ పహల్గామ్ ఉగ్రదాడికి ని…

కర్నూలు జిల్లా కేంద్రంలో వైయస్ఆర్ సీపీ క్యాండిల్ ర్యాలీ పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా వైయస్ఆర్ సీపీ శాంతి ర్యాలీ. క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న కర్నూలు మేయర్ బీవై రామయ్య , జిల్లా ఉపాధ్యక్షులు అహమ్మద్ అలీ ఖాన్ మరియు పార్టీ ముఖ్య నేతలు. శాంతి ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైయస్ఆర్ సీపీ శ్రేణులు. #PahalgamTerroristAttack #YSRCP YSR Congress Party - YSRCP Ysrcp social media kurnool YS Jagan Mohan Reddy #AndhraPradesh YSRCP Social Media Minoritys Ysrcp Kurnool YSJagan Mark Governance

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post