Skip to content
Ahmed Ali KhanYSRCP Kurnool City President
Social Service

Public Issues

36 activities

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ ప్రక్రియపై గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట…

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ ప్రక్రియపై గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు శ్రీ అహ్మద్ అలీ ఖాన్ గారి లీగల్ టీమ్ ఆధ్వర్యంలో, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2027 జనగణన (Census) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో వార్డుల సరిహద్దుల పునర్విభజన (Delimitation) చేపట్టడాన్ని సవాలు చేస్తూ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబడింది. ఈ కేసులో అడ్వకేట్లు శ్రీ మసాలేగర్ హిదాయతుల్లా గారు మరియు శ్రీ ఎస్.ఎం. సుభానీ గారు పిటిషనర్ తరఫున గౌరవ హైకోర్టు ముందు హాజరై వాదనలు వినిపించారు. పిటిషన్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం, 2027 జనగణన ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సరిహద్దులను మార్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడం చట్ట విరుద్ధమని, ఏకపక్షమని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొనబడింది. ఈ మేరకు జారీ చేసిన G.O.Ms.No.65 తేదీ 24-03-2026, సంబంధిత సర్క్యులర్లు మరియు 17-05-2026 తేదీ ప్రాథమిక నోటిఫికేషన్లను రద్దు చేయాలని, జనగణన ప్రక్రియ పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ మరియు వార్డుల సరిహద్దుల మార్పులకు సంబంధించిన తదుపరి చర్యలను నిలిపివేయాలని గౌరవ హైకోర్టును కోరారు. ఈ వ్యవహారంపై 11-06-2026న జరిగిన విచారణలో ఇరు పక్షాల వాదనలు విన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, విషయాన్ని పరిశీలించి ఇంటరిమ్ స్టే (తాత్కాలిక నిలుపుదల) ఉత్తర్వులు మంజూరు చేయడం జరిగింది. ప్రజాస్వామ్య విలువలను, ప్రజల హక్కులను పరిరక్షించే దిశగా కర్నూలు ప్రజల తరఫున ఈ న్యాయపోరాటం కొనసాగుతుందని, చట్టబద్ధమైన విధానాల ద్వారానే ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు శ్రీ అహ్మద్ అలీ ఖాన్ గారు తెలియజేశారు.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

నంద్యాల శ్రీనివాస సెంటర్ వద్ద మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర…

నంద్యాల శ్రీనివాస సెంటర్ వద్ద మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహంపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. పట్టపగలు ఈ ఘటన జరుగుతున్నప్పటికీ దానిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి వెనుక ఎవరైనా ప్రేరేపకులు ఉన్నట్లయితే వారిని కూడా గుర్తించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుల మానసిక స్థితి గురించి వివరణలు ఇవ్వడం కంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా పోలీసు యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. మహానేత వైఎస్సార్ గారి సేవలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని, ఇటువంటి దుశ్చర్యల ద్వారా ఆయనపై ప్రజల అభిమానాన్ని ఎవరూ తగ్గించలేరని అహ్మద్ అలీ ఖాన్ స్పష్టం చేశారు.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

రెడ్‌బుక్ రాజ్యంపై న్యాయపోరాటం 🚨

🚨 రెడ్‌బుక్ రాజ్యంపై న్యాయపోరాటం 🚨 కూటమి ప్రభుత్వం అండదండలతో పోలీసుల వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తప్పుడు కేసులు, మానసిక వేధింపులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్రంగా ఖండించదగిన విషయం. ఈ వేధింపులను తట్టుకోలేక వైఎస్సార్సీపీ యువజన విభాగం కర్నూలు సిటీ అధ్యక్షుడు బాలు గారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ప్రతి కార్యకర్తను కలచివేసింది. అలాగే కర్నూలులో వైఎస్సార్సీపీకి చెందిన మైనారిటీ నాయకులపై కూడా కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్యాయాలకు నిరసనగా కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగిన భారీ ఆందోళనలో జిల్లా అధ్యక్షులు ఎస్.వి. మోహన్ రెడ్డి గారు, నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, డా. సతీష్ గారు, చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి గారు, రాం పులి యాదవ్ గారు, కాటసాని ఓబుల్ రెడ్డి గారు, బుట్టా ప్రతుల్ గారు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు మాట్లాడుతూ — “ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టలేరు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నీచ రాజకీయాలు ఆపాలి, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు చేపడతాం” అని హెచ్చరించారు. ✊ కార్యకర్తల గౌరవం కోసం… ✊ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం… వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుంది!

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

రెడ్‌బుక్ రాజ్యం

రెడ్‌బుక్ రాజ్యం కూటమి ప్రభుత్వ నాయకుల అండతో పోలీసుల తప్పుడు కేసుల వేధింపులు కర్నూలు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరుగుతున్న పోలీసుల వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం సిటీ ప్రెసిడెంట్ బాలు గారిపై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా పోలీస్ స్టేషన్‌కు రావాలని పదేపదే ఒత్తిడి చేయడం, అక్రమంగా సారాయి మరియు గంజాయి కేసులు నమోదు చేయడం దారుణం. ఈ వేధింపులను తట్టుకోలేక బాలు గారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం చాలా బాధాకరం. ఈరోజు అహ్మద్ అలీ ఖాన్ గారు, వైఎస్సార్‌సీపీ కర్నూలు నగర అధ్యక్షులు, బాధితుడు బాలు గారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్యానికి మచ్చ. కూటమి ప్రభుత్వ నాయకుల అండతో పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం” అని పేర్కొన్నారు. బాలు గారికి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… “పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను” అని అహ్మద్ అలీ ఖాన్ గారు పేర్కొన్నారు.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

Under the directions of YSR Congress Party President and former Chief Minister…

Under the directions of YSR Congress Party President and former Chief Minister Shri Y. S. Jagan Mohan Reddy, large-scale protest programs were conducted across all constituency headquarters in the state, condemning the inappropriate remarks made by ABN Andhra Jyothi Chairman Radhakrishna. On this occasion, Kurnool City President Ahmed Ali Khan stated that the comments made about the family members of YSR Congress Party leaders—especially women—during the “Weekend with RK” program aired on ABN Andhra Jyothi were highly objectionable, indecent, and insulting to the dignity of women. Through an official statement, he strongly condemned these remarks, emphasizing that such statements are against media ethics. He demanded that cases be immediately filed against Radhakrishna and that he issue a public apology to all the women of the state. He further stressed that protecting the dignity of women is everyone’s responsibility and warned that strict action should be taken to prevent such incidents from recurring in the future.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

Chandrababu’s Empty Promises Exposed – Farmers Betrayed Again

Chandrababu’s Empty Promises Exposed – Farmers Betrayed Again Chief Minister Chandrababu Naidu’s much-publicized “experience” has once again failed the farmers of Andhra Pradesh. Despite boasting 40 years in politics, his government has delivered nothing but speeches, excuses, and blame games. Before elections, he toured villages shedding crocodile tears for farmers, promising irrigation water, financial stability, and comprehensive support. Today, those very farmers are left struggling for water, relief, and basic assurances. The promises have evaporated — just like the hope of thousands of agricultural families. While the previous government under Y.S. Jagan Mohan Reddy implemented direct benefit schemes and farmer welfare programs, the current administration has stalled progress and created uncertainty. Instead of governance, what people are witnessing is pure political drama. Farmers do not need press conferences. They do not need slogans. They do not need rehearsed sympathy. They need water. They need support. They need action. Four decades of experience should have brought solutions — not suffering. The people of Andhra Pradesh deserve accountability, not theatrics.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

* రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంలో పలువురు చిన్నారులు మృతి చెందడంతో పాటు అనేకమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఈ సంఘటన మీద వైసీపీ అధ్యక్షుడు శ్రీ అహ్మద్ అలీ ఖాన్ గారు స్పందించారు. ఆయన చిన్నారుల మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అనేకచోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, ప్రతిపక్ష పార్టీ ఇళ్ల మీద దాడులు , తిరుపతి లడ్డూ మీద అసత్య ఆరోపణలు తప్ప ప్రజా క్షేమం, చిన్నారుల ఆరోగ్యం, వీటి మీద ప్రభుత్వం కి శ్రద్ద లేదని , ఎంతసేపు ప్రతిపక్షం మీద బురదచల్లడం తప్ప ప్రజల ప్రాణాలు మీద ఇసుమంతైనా బాధ్యత లేదనీ, ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో ని అన్నీ పాల కేంద్రాల మీద మెరుపు దాడులు నిర్వహించి ప్రజలకు స్వచ్ఛమైన పాలను అందించాలనీ ఆయన ప్రభుత్వం ని డిమాండ్ చేసారు. *పాలలో ప్రమాదకరమైన యూరియా,కాస్టిక్ సోడా , మెలమైన్ వంటి హానికరమైన రసాయనాలతో చిన్నారుల కిడ్నీలు పాడైపోయి మరణించడంతో పాటు,అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు* ప్రభుత్వం బాధ్యతరహితమైన‌ పాలన వలన చివరకు చిన్నారులకి కూడా రాష్ట్రంలో రక్షణ లేదనీ , ఆరోగ్య శ్రీని ప్రభుత్వం అమలుచేయకపోవడం వలన ప్రైవేటు, కార్పోరేట్ ఆస్పత్రిలో ప్రజలు లక్షల రూపాయలు చెల్లించలేక ఇబ్బందుల్లో ఉన్నారనీ ప్రభుత్వం తక్షణమే ఈదిశగా చర్యలు తీసుకోని పరిహారం తో పాటుగా బాధిత కుటుంబాలు కి ఆసరగా నిలబడాలని కోరారు.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

రైతుల హక్కుల కోసం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఛలో పోతిరెడ్…

రైతుల హక్కుల కోసం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఛలో పోతిరెడ్డిపాడు’ ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో భాగంగా పోతిరెడ్డిపాడు వద్ద నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ కి వైయస్‌ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, శైలజానాథ్ గారు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి గారు, చల్లా మధు గారు, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారు ఇతర ముఖ్య నాయకులతో కలిసి హాజరైన కర్నూలు వైస్సార్సీపీ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు. అహ్మద్ అలీ ఖాన్ గారు మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి హయాంలో సాగు త్రాగునీరు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సీమ ప్రాంత అభివృద్ధి కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు 800 అడుగుల నీరు చేరక ముందే నీటి తరలిస్తున్నారు. వాటిని అరికట్టేందుకు వైఎస్ జగన్ గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. సీమ ప్రజలకు సాగు త్రాగు నీరు అందిస్తున్న వాటిని చంద్రబాబు అడ్డుకున్నారు. 22 టిఎంసి సీమకు రావాలి అయితే వాటిని రాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చంద్రబాబు అడ్డుకున్నారు. ఎత్తిపోతల పథకం పూర్తి చేయకపోతే కరువుతో సీమ అల్లాడుతుంది. రానున్న రోజుల్లో సీమకు న్యాయం జరగాలంటే సీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాని తెలిపారు..

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

ఛలో పోతిరెడ్డిపాడు

ఛలో పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సాదించుకోవడం కోసం భారీ బహిరంగ సభ సందర్బంగా కర్నూలు విచ్చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వైస్సార్సీపీ కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కు వ్యతిరేక…

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కర్నూలు నగరంలో స్వచ్బంధంగా పాల్గొని 60 వేలకు పైగా సంతకాలను పూర్తి చేసి విజయవంతం చేసిన కర్నూలు నగర ప్రజలకు , వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులకి , కార్యకర్తలకు ,శ్రేయోభిలాషులకి,అభిమానుల కి పేరు పేరునా నా ప్రత్యేక ధన్యవాదాలు. *అహ్మద్ అలీ ఖాన్ ,* *వై.యస్.ఆర్.సి.పి. నగర అధ్యక్షులు,* *కర్నూలు.*

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

చంద్రబాబు లబ్ధి కోసమే ప్రభుత్వ మెడికల్ కళాశాల లను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రల…

చంద్రబాబు లబ్ధి కోసమే ప్రభుత్వ మెడికల్ కళాశాల లను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు అని వైస్సార్సీపీ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ మండిపడ్డారు ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ కర్నూలు నగరంలో దాదాపు 65 వేల కు పైగా సంతకాలు చేసి ప్రజలు మద్దతు తెలిపారని అన్నారు , ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే వైద్య విద్యా తో పాటు వైద్యం కూడా ఖరీదు గా మారుతుందన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నిర్ణయన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు . “ కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారి కామెంట్స్”

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ “ప్రజా ఉద్యమం” కర్నూలు జి…

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ “ప్రజా ఉద్యమం” కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రజల నుండి సేకరించిన సంతకాల పత్రులని కర్నూలు జిల్లా కేంద్రం లోని యస్.టి.బి.సి.కళాశాల గ్రౌండ్ నుండి రాజావిహార్ వరకు ర్యాలీగా వాహనంలో తాడేపల్లి ప్రధాన కార్యాలయానికి సాగనంపిన వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు , పార్టీ ముఖ్య నేతలు .. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సంతకాలన్నీ సేకరించడం జరిగింది..ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేయకూడదంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల కు, ప్రవేట్ మెడికల్ కాలేజీలకు ఉన్న భేదం ప్రైవేట్ హాస్పిటల్ లో డబ్బులు చెల్లించి వైద్యం చేపించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు! ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి అనుబంధ విభాగాల నాయకులు , కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్…

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “ప్రజా ఉద్యమం - కోటి సంతాకల” సేకరణ కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలో ప్రజలని చైతన్యపరిచి వారి నుండి సేకరించిన సంతకాల పత్రాలను కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు , జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి గారు జిల్లా పార్టీ కార్యాలయానికి పత్రాలను చేరవేయడం జరిగింది... కూట‌మి ప్రభుత్వ కక్షపూరిత విధానాలను తీవ్రంగా నిరసిస్తూ వైఎస్ఆర్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గారి పిలుపు మేరకు ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొని త‌మ మ‌ద్ద‌తు తెలిపార‌ని, ఈ నెల 15 నాటికి జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాలను ర్యాలీగా తరలించనున్నామ‌ని, ఈ నెల 17న పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, పార్టీ పెద్ద‌లు ఈ కోటి సంతకాలను గవర్నర్‌­కు అందిస్తార‌ని తెలిపారు, ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసిన పార్టీ శ్రేణుల‌ను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి నాయకులు నరసింహులు యాదవ్ గారు, కార్పొరేటర్లు , నాయకులు , కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. #AdminPost YS Jagan Mohan Reddy YSRCP Social Media YSR Congress Party - YSRCP Aak Ysrcp Followers #JaganannaConnects #Kotisanthakalu YSRCPForAll YSRCPSOCIALMEDIA

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

ఈరోజు కర్నూలు నగరంలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయం నందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…

ఈరోజు కర్నూలు నగరంలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయం నందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం కర్నూలు నగరంలో సేకరించిన సంతకాలు పత్రాలకు కర్నూలు జిల్లా కేంద్రానికి పంపించిన కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు అనంతరం కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌ.శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాలు సేకరణలో కర్నూలు నగరంలో సంతకాల సేకరణ పూర్తి చేశారు.ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు , నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో కర్నూలు నగర వైఎస్ఆర్ సీపీ నాయకులు రసూల్ ఖాన్ , షోయబ్, అశోక్ , యువజన విభాగం నాయకులు చోటు @శశిధర్ , మాలిక్ , సోషల్ మీడియా విభాగం నాయకులు సాదిక్ , మహిళ నాయకురాలు సుచరిత గారు, నాయకులు ,కార్యకర్తలు మరియు అహ్మద్ అలీ ఖాన్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

వైయస్‌ఆర్‌సీపీ ర్యాలీతో దద్దరిల్లిన కర్నూలు 🔥

వైయస్‌ఆర్‌సీపీ ర్యాలీతో దద్దరిల్లిన కర్నూలు 🔥 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కర్నూలు సిటీలో లో భారీ ర్యాలీ నిర్వహించడమైనది.. ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించిన వైసిపి నేతలు కార్యకర్తలు స్టూడెంట్స్, ప్రజలు...

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

గౌరవ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన…

గౌరవ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కర్నూలు వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ -————————————— కర్నూలు నగర వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ “కోటి సంతకాల సేకరణ” కార్యక్రమం కె.వి.ఆర్. మహిళా కళాశాల , రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది!..

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

యూత్ అవేకనింగ్…

యూత్ అవేకనింగ్… ఈరోజు కర్నూలు నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల ప్రచారం నారాయణ కాలేజ్, పాత ఈద్‌గాహ్ ఎదురుగా, కర్నూలులో నిర్వహించారు. ఈ కార్యక్రమం కర్నూలు వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు శ్రీ అహ్మద్ అలీ ఖాన్ గారి నాయకత్వం మరియు మార్గదర్శకత్వంలో జరిగింది. @highlight YS Jagan Mohan ReddyYSRCP Social Media YSR Congress Party - YSRCP Kurnoolions Page Aak Ysrcp

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

కర్నూలు నగర వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రుల…

కర్నూలు నగర వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక కోటి సంతకాల ఉద్యమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కర్నూలు ప్రసిద్ధ ఉస్మానియా కళాశాలలో, వైఎస్సార్సీపీ కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారి నాయకత్వం మరియు మార్గదర్శకత్వంలో జరుగుతోంది.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

ఈ రోజు కర్నూలు సిటీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు కర్నూలు సిటీ వైఎస్సార్సీపీ అధ్యక…

ఈ రోజు కర్నూలు సిటీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు కర్నూలు సిటీ వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ అహ్మద్ అలీ ఖాన్ గారి నాయకత్వంలో కెసీ కాలువ పార్క్ సమీపంలో 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

కర్నూలు నగర వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రుల…

కర్నూలు నగర వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మాస్టర్స్ జూనియర్ కాలేజీ వద్ద, ఫన్ అండ్ ఫుడ్ ఎదురుగా, జి.జి. ఆసుపత్రి సమీపంలో వైఎస్సార్సీపీ కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారి నాయకత్వం మరియు మార్గదర్శకత్వంలో జరుగుతోంది…

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

1 Million Signature Camping against Privatisation Of Government Medical Collag…

1 Million Signature Camping against Privatisation Of Government Medical Collages & Hospitals

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

కర్నూలు వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారి ఆధ్వర్యంలో కోటి సంత…

కర్నూలు వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ -————————————— ఏపీ కూటమి ప్రభుత్వము 17 వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రులను ప్రైవేటీకరించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతి వీధి స్థాయిలో అవగాహన కార్యక్రమం మరియు 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని కర్నూలు వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు మార్గదర్శకత్వం మరియు నాయకత్వంలో ఈ రోజు సి. క్యాంప్ రైతు బజార్ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ నగర నాయకులు మరియు కార్యకర్తలు నిర్వహించారు.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

అహ్మద్ అలీ ఖాన్ యువత కార్యచరణలో ఉన్నారు. 1 కోటి సంతకాల ప్రచారం కోసం కష్టపడి పన…

అహ్మద్ అలీ ఖాన్ యువత కార్యచరణలో ఉన్నారు. 1 కోటి సంతకాల ప్రచారం కోసం కష్టపడి పనిచేస్తున్నారు. #YSJagan #JaganannaConnects #friendsfollowersViewers #YouthPower YS Jagan Mohan Reddy YSRCP Social Media YSR Congress Party - YSRCP Aak Ysrcp

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కర్నూలు లో కోటి సంతకాల సేకర…

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కర్నూలు లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తొలి సంతకం పెట్టి కార్యక్రమం ప్రారంభించిన వైఎస్ఆర్సిపి నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు ---------------------------------------- వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలవ్యవధి లోనే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ప్రవేశపెట్టి పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు డాక్టర్ కోర్స్ అందుబాటులో ఉండే విధంగా మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని వైఎస్ఆర్సిపి కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారుతెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 16 నెలల కాల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 17 మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రవేటీకరణ చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ పరిసర ప్రాంతాలలో సంతకాల సేకరణ కార్యక్రమం తొలి సంతకం చేసి ప్రారంభించరు,అనంతరం వైఎస్ఆర్సిపి కర్నూల్ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హామీలకే పరిమితం కానుందని తెలిపారు రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలకు 4000 కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కళాశాలలు ప్రారంభమై పేద విద్యార్థులకు డాక్టర్స్ కావాలనే కలను నెరవేర్చే విధంగా ఉంటుందని తెలిపారు పేద విద్యార్థుల కలను నీరుగారిచే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డ్ కార్పొరేటర్ జుబేర్ అహ్మద్ గారు , వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మహేశ్వర రెడ్డి గారు , 8వ వార్డ్ నాయకులు అబ్రార్ గారు , ఫారూఖ్ గారు , నజీర్ అలీ ఖాన్ గారు , 24వ వార్డ్ నాయకులు అశోక్ బాబు గారు ,సుచరిత గారు , 23వ వార్డ్ నాయకులు ముస్తఫా గారు , ప్రిన్స్ గారు లు తదితరులు పాల్గొన్నారు.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

#SaveMedicalCollegesInAP

#SaveMedicalCollegesInAP కర్నూలు జిల్లా: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చలో ఆదోని మెడికల్ కాలేజీ కార్యక్రమం భారీగా తరలివచ్చిన విద్యార్థులు, యువకులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చంద్రబాబు కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు ఆదోని మెడికల్ కాలేజీ పనులు పరిశీలించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదోని సమన్వయకర్త సాయిప్రసాద్ రెడ్డి గారు, ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్టా రేణుక గారు, పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి గారు రాష్ట్ర మహిళ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి గారు, రాష్ట్ర యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ బుట్టా ప్రతుల్, కర్నూలు నగర అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్, కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివా రెడ్డి , విద్యార్థి విభాగం అధ్యక్షులు ప్రశాంత్ మరియు పార్టీ ముఖ్య నాయకులు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు, యువత భారీ ఎత్తున పాల్గొన్నారు.....

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

అన్నదాతల పోరాటం – ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై యుద్ధం

అన్నదాతల పోరాటం – ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై యుద్ధం తేదీ: సెప్టెంబర్ 9, 2025 ఆంధ్రప్రదేశ్‌లో రైతు సమాజం ఎరువుల కొరత మరియు బ్లాక్ మార్కెట్ కారణంగా ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న సాగు ఖర్చులు, పడిపోతున్న పంట ధరలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులు, ఇప్పుడు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు ఎరువులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల పునరావృత విజ్ఞప్తులప్పటికీ, అధికారిక సరఫరా మార్గాల ద్వారా ఎరువులు అందడం లేదు. ఈ పరిస్థితిని ఉపయోగించుకుంటూ డీలర్లు యూరియా మరియు ఇతర కీలక ఎరువులను ప్రభుత్వ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు, సుమారు ₹270 రూపాయలకే లభించాల్సిన ఎరువుల సంచులు ₹450–600కి విక్రయించబడుతున్నాయి. అలాగే, యూరియా సంచి ప్రభుత్వ ధర కంటే ₹200–300 ఎక్కువకు అమ్మబడుతోంది. ఈ దుస్థితిని వ్యతిరేకిస్తూ, వైఎస్ఆర్‌సీపీ నాయకులు మరియు రైతు సంఘాలు నేడు (సెప్టెంబర్ 9, 2025) రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఎరువులు సరఫరా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. రైతులు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎరువులు ప్రభుత్వ స్థిర ధరలకు లభించేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ప్రధాన డిమాండ్లు: • రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు తక్షణం ఎరువుల నిల్వలు విడుదల చేయాలి. • బ్లాక్ మార్కెట్ వ్యాపారులు, అవినీతి డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. • ఎరువుల సరఫరా పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సమాజాన్ని పట్టించుకొని ఈ టీడీపీ ప్రభుత…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సమాజాన్ని పట్టించుకొని ఈ టీడీపీ ప్రభుత్వంపై మత పెద్దలు ధ్వజమెత్తారు. టీడీపీ ఇచ్చిన హామీలు అన్ని మరచి పోయిందని, ఇమామ్ మరియు మౌజ్జన్ లకు ఇవ్వవలసిన గౌరవవేతనాలు ఇంతవరకు ఇవ్వలేదని అడిగితే కనీసం సమాధానం కూడా లేదని పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించకపోతే చర్యలు తప్పవని ఇప్పటికే ముస్లింల పట్ల టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమి బాగాలేదని అసంతృప్తి తో ఉన్న ముస్లిoలు కలెక్టర్ ఆఫీసు పై ధ్వజమెతీ, కలెక్టర్ ఆఫీసు ముందు ఉన్న గాంధి విగ్రహం ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కర్నూలు నగరాధ్యక్షులు అహమ్మద్ అలీ ఖాన్ గారు, జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ T,M.D. ఫిరోజ్, సిటీ మైనారిటీ ప్రెసిడెంట్ భాష, కార్పొరేటర్ షేక్ జుబేర్, మరియు షేక్షావలి, 4వ వార్డు ఇన్చార్జి రియాజ్ భాష, 8వ వార్డు ఇన్చార్జి అబ్రార్, మైనార్టీ సీనియర్ లీడర్ సలీం భాయ్, జిల్లాకు సంబంధించిన మైనారిటీ లీడర్స్ అందరూ పాల్గొని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

Wakf Bachao~Dastoor Bachao

Wakf Bachao~Dastoor Bachao Public Meeting Program Organised By All India 🇮🇳 Muslim Personal Law Board Against Wakf Amendment Bill 2025 at STBC Grounds. Kurnool

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

కర్నూలు జిల్లాలో వెన్నుపోటు దినం

కర్నూలు జిల్లాలో వెన్నుపోటు దినం కర్నూలు లోని గౌరీ గోపాల్ హాస్పిటల్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ నుండి కలెక్టరేట్ వరకూ భారీ రోడ్ షో నిర్వహించడం జరిగింది. రోడ్డు షో అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయ్యింది. అయినా ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలని తప్పుదోవ పట్టించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు SV మోహన్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు, KDCC బ్యాంక్ మాజీ చైర్మన్ శ్రీమతి విజయ మనోహరి గారు, కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, మైనార్టీ సెల్ రాష్ట్ర చైర్మన్ ఖాదర్ బాషా గారు, మరియు ఇతర జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. @highlight YS Jagan Mohan Reddy YSRCP Social Media YSR Congress Party - YSRCP #YSRCongressParty #CommunicationsYSRCP #JaganannaConnects #YSRCPSOCIALMEDIA #YSJaganMohanReddy Ahmed Ali Khan Follower Kurnool Follower's

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి సూచనలతో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు వ…

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి సూచనలతో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూలులో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీ అహ్మద్ అలీ ఖాన్ కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు Under The Guardianship Of All India 🇮🇳 Muslim Personal Law Board, A United & Peaceful Rally Against Wakf Amendment Act Was Conducted From Old Town To Collector Office,Kurnool City. At The End Of Rally Gave Memmorandum To Kurnøøl Dist Collector. All Communities , Political Parties & Organisations Gave There Support. I’m Thankful 🙏🏻 To People Of Kurnool Who Made This Peace Rally A Grand Success…

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

Peace Protest Rally Against Wakf Amendment Act …. Everyone Should Join & Make…

Peace Protest Rally Against Wakf Amendment Act …. Everyone Should Join & Make It Successful .

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

YSRCP District President Sri S.V. Mohan Reddy Ji & YSRCP Dist Vice President S…

YSRCP District President Sri S.V. Mohan Reddy Ji & YSRCP Dist Vice President Sri Ahmed Ali Khan Participated In Round Table Conference Organised By All India Muslim Personal Law Board & Extended Our Support From The Party To Upcoming Peace Protest Rally Against Wakf Amendment Act on Monday 28-4-2025. All Political Party Leaders, NGOs, Christian Minority Pastors & Christian Organisations, Intellectuals Were Present & Extended Their Support.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

Under the Leadership Of Sri.Y.S.Jagan Mohan Reddy Ji, Rajampet Member Of Parli…

Under the Leadership Of Sri.Y.S.Jagan Mohan Reddy Ji, Rajampet Member Of Parliament Sri P.V. Midhun Reddy of YSR Congress Party Has Opposed & Rejected WAQF Amendment Bill… Despite The Uproar Of Entire Community & Opposed By Political Partys The Bill Was Passed .. Minorities Were Once Again Betrayed By Ruling TDP+BJP+Janasena Kutami Government In Andhra Pradesh.

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

Ysrcp Congress party.

Ysrcp Congress party. కర్నూల్; ఫీజ్ రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీ లు ప్రైవైటి కరణ పై కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కర్నూలు సిటీ లోని గౌరీ గోపాల్ ధర్ణచౌక్ దగ్గర పార్టీ జండా ఎగురవేసి అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే యువత పోరు మరియు ఫీజ్ రీయింబర్స్మెంట్ కింద 4600 కోట్లు బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గౌరీ గోపాల్ ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు అహ్మద్ అలీఖాన్ గారు, అధ్యక్షులు S V మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాదయాత్ర గా వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP Ysrcp social media kurnool Kurnoolions Page Ysrcp Minority's AP

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

Protest Program On 12th March Against Kutami Government For Fees Reimbursement…

Protest Program On 12th March Against Kutami Government For Fees Reimbursement To Students …

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post

Salaam Khan Circle Monument Demolished… Without Any Prior Notice By Kurnool Mu…

Salaam Khan Circle Monument Demolished… Without Any Prior Notice By Kurnool Muncipal Corporation.1000s of Muslim Minorities Fought & Demanded For This Cause & Then Muncipal Corporation Approved & Laid Foundation in 2012. Since Then Due To Various Controversies It was Delayed… We Demand That KMC Should Immediately Restore & Rename Salaam Khan Circle. #JaganannaConnects #YSJaganCares #SakshiNews #JaganannaOnceMore #YSRCongressParty #kurnooldistrict YSJagan Mark Governance YSRCP Kurnool Kurnoolions Page My city-KURNOOL

Posted by Ahmed Ali Khan, reproduced as written.

View the original post