ప్రధాన సమాచారానికి వెళ్లండి
అహ్మద్ అలీ ఖాన్వైసీపీ కర్నూలు నగర అధ్యక్షులు
సామాజిక సేవ

ఆరోగ్య శిబిరాలు

6 కార్యక్రమాలు

మాజీ కార్పొరేటర్ మరియు సీనియర్ మైనారిటీ నాయకులు జంషీద్ గారు రోడ్డు ప్రమాదాని…

మాజీ కార్పొరేటర్ మరియు సీనియర్ మైనారిటీ నాయకులు జంషీద్ గారు రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని కర్నూలు వైఎస్ఆర్సీపీ సిటీ ప్రెసిడెంట్ అహ్మద్ అలీఖాన్ గారు తెలుసుకుని, హాస్పిటల్ కు వెళ్ళి పరామర్శించడం జరిగింది.

అహ్మద్ అలీ ఖాన్ పోస్ట్ చేసినది, ఆయన రాసినట్లుగానే ప్రచురించబడింది.

అసలు పోస్ట్ చూడండి

జొహరాపురంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రీ విశ్వనాథ్ గారు అనారోగ్యంతో బాధ…

జొహరాపురంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రీ విశ్వనాథ్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కర్నూలు నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ గారికి ధైర్యం చెప్పి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటామని అహ్మద్ అలీ ఖాన్ గారు తెలిపారు. "కార్యకర్తలే పార్టీకి బలం. వారి సంక్షేమమే మనందరి బాధ్యత" అని పేర్కొన్నారు.

అహ్మద్ అలీ ఖాన్ పోస్ట్ చేసినది, ఆయన రాసినట్లుగానే ప్రచురించబడింది.

అసలు పోస్ట్ చూడండి

ప్రజల ఆరోగ్యం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే నాయకుడు అహ్మద్ అలీ ఖాన్ గారు, వ…

ప్రజల ఆరోగ్యం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే నాయకుడు అహ్మద్ అలీ ఖాన్ గారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు. గుండెపోటుతో బాధపడుతూ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని క్యాజువాలిటీ వార్డులో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్త మహబూబ్ అలీ గారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వెంటనే వైద్యులతో మాట్లాడారు. రోగికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ప్రత్యేకంగా సూచిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రజల పట్ల మానవత్వంతో ముందుకు రావడం నిజమైన నాయకత్వానికి నిదర్శనం. మహబూబ్ అలీ గారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. 🙏.

అహ్మద్ అలీ ఖాన్ పోస్ట్ చేసినది, ఆయన రాసినట్లుగానే ప్రచురించబడింది.

అసలు పోస్ట్ చూడండి

ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి మసూం బాషా దర్గా సమీపంలో గుర్తు తెలియని దుండగుడు కత్తి…

ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి మసూం బాషా దర్గా సమీపంలో గుర్తు తెలియని దుండగుడు కత్తితో పొట్టలో పొడవడంతో తీవ్రంగా గాయపడిన షేక్ మునవ్వర్ బాషా గారి నివాసానికి వెళ్లి, ఆయనను మరియు కుటుంబ సభ్యులను పరామర్శించాను. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి మునవ్వర్ గారిని సమయానికి ఆసుపత్రికి తరలించడం వల్ల ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మునవ్వర్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

అహ్మద్ అలీ ఖాన్ పోస్ట్ చేసినది, ఆయన రాసినట్లుగానే ప్రచురించబడింది.

అసలు పోస్ట్ చూడండి

చిన్నారి షేక్ హీన కు మెరుగైన వైద్యం అందించాలి.

చిన్నారి షేక్ హీన కు మెరుగైన వైద్యం అందించాలి. ******************************************* కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించిన వైస్సార్సీపీ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు . కర్నూలు నగరంలోని స్థానిక బండిమెట్ట మునిసిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న చిన్నారి షేక్ హీన స్కూల్ గ్రౌండ్ లో తోటి విద్యార్థినిలతో ఆడుకుంటుడగా చిన్నారులు అనుకోకుండా అగ్గిపుల్లలు వెలిగించారు అవి అక్కడేవున్న చిత్తుకాగితాలు అంటుకుని అక్కడికక్కడే చిన్నారికి అంటుకున్నాయి చిన్నారి షేక్ హీన తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైదశాలకు చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వైస్సార్సీపీ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు పరామర్శించారు. చిన్నారి షేక్ హీనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.అలాగే వైద్య ఖర్చుల కోసం విద్యార్థి తల్లిదండ్రులకు ఆర్ధిక సహాయం చేసారు.ఈ సందర్భంగా విద్యార్థి కుటుంబనికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తానని హామీఇచ్చారు.

అహ్మద్ అలీ ఖాన్ పోస్ట్ చేసినది, ఆయన రాసినట్లుగానే ప్రచురించబడింది.

అసలు పోస్ట్ చూడండి

బ్రైటర్ బీ స్కూల్ (షాహీన్ గ్రూప్)లో విద్యార్థుల కోసం నిర్వహించిన డెంటల్ చెకప్…

బ్రైటర్ బీ స్కూల్ (షాహీన్ గ్రూప్)లో విద్యార్థుల కోసం నిర్వహించిన డెంటల్ చెకప్ క్యాంప్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాను. ఈ కార్యక్రమాన్ని రాయలసీమ డెంటల్ క్లినిక్‌కు చెందిన శ్రీ & శ్రీమతి డా. రెహాన్ అలీ ఖాన్ గారు మరియు వారి బృందం డా. వసీమ్, డా. సోహైల్, డా. శ్వేత, డా. దీపిక గారు నిర్వహించారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి, పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్న స్కూల్ కో-రెస్పాండెంట్ జనాబ్ షోయబ్ గారు మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు….

అహ్మద్ అలీ ఖాన్ పోస్ట్ చేసినది, ఆయన రాసినట్లుగానే ప్రచురించబడింది.

అసలు పోస్ట్ చూడండి